బిగ్‌బాస్ 6 విజేత వూర్వశి ఢోలకియా
ముంబయి: బిగ్‌బాస్ సీజన్ 6 రియాలిటీ షోలో టీవీ కళాకారణి వూర్వశి ఢోలకియా విజేతగా నిలిచారు. వరసగా ఒక టీవీ కళాకారిణి ఈ షో గెలవడం ఇది మూడోసారి గతంలో శ్వేతా తివారి. జుహి పర్మార్‌లు సీజన్ 4,5 లలో విజేతలుగా నిలిచారు. పూర్వశికి రూ.50 లక్షల ప్రైజ్‌మనీ, ట్రోఫీ లభిస్తాయి. అక్టోబరు 1 నుంచి ప్రారంభమైన సీజన్ 6లో 14 మంది పోటీ పడగా నిన్న జరిగిన తుది పోటీలో విజేతను ప్రకటించారు.