తొర్రూర్ 16 సెప్టెంబర్( జనంసాక్షి )
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భం గా నేడు తొర్రూర్ లో బిజెపి ఆధ్వర్యం లో ఉత్సవాల ను ఘనంగా నిర్వహించడం జరిగింది.స్థానిక అమర వీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన ఈకార్యక్రమం లో తెలంగాణ విమోచన కోసం అమరులైన వారి కి నివాళులు అర్పించిన అనంతరం బీజేపీ తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భం గా బిజెపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య,తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ లు సంయుక్తం గా మాట్లాడు తూ నిజాం నవాబు నిరంకుశ పాలన లో నరకం చూసిన తెలంగాణ ప్రజల కు సర్ధార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక చొరవ చూపి నిజాం నవాబు మెడలు వంచి 1948,సెప్టెంబర్ 17 న తెలంగాణ ప్రజల కు విముక్తి ప్రసాదించాడని ,ఆ రోజు తెలంగాణ తో పాటు హైదరాబాద్ సంస్థానం లో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాల్లో స్వాతంత్ర్యం సిద్ధించింది అని తెలిపారు. అప్పటి నుంచి హైదరాబాద్ సంస్థానం లో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికం గా ఉత్సవాల ను నిర్వహిస్తున్న,తెలంగాణ ప్రాంతం లో మాత్రం జరుపలేదని, విమోచన ఉత్సవాల ను అధికారికం గా జరుపాలని బీజేపీ అనేక సంవత్సరాలు గా ఉద్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి పెంచిందని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేర కు అధికారికం గా ఉత్సవాల ను జరుపాలని నిర్ణయం తీసుకున్నారు అని తెలిపారు.దీని తో దిగి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్సవాల ను అధికారికం గా జరుపాలని ప్రకటించింది కానీ తెలంగాణ విమోచన పోరాట చరిత్ర ను అవమాన పరిచేలా జాతీయ సమైక్యత దినం అంటూ చరిత్రను వక్రీ కరించే ప్రయత్నం చేస్తున్నదని, ఇది ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినోత్సవం అని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం నేడు హైదరాబాదు లోని పరేడ్ గ్రౌండ్లో అధికారికం గా తెలంగాణ విమోచన దినోత్సవం పేరు తో భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.నిజాం మెడలు వంచి సెప్టెంబర్ 17 న అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ పటేల్ తెలంగాణ విముక్తి ప్రసాదిస్తే ఆయన వారసుడి గా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో అధికారికం గా ఉత్సవాల్లో పాల్గొని జాతీయ జెండా ను ఎగురవేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని తెలిపారు.కేసిఆర్ ఎనిమిది ఏళ్ళ పాలన లో తెలంగాణ విమోచన దినోత్సవం జరుపకుండా అవమానించార ని కేవలం ఎంఐఎం ఒత్తిడి కి తలొగ్గి ఈ ఉత్సవాల ను అధికారికం గా జరుపకుండా మోసం చేశారని, కేసీఆర్ భేషరుతు గా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.నిజాం నిరంకుశ పాలన కు వ్యతిరేకంగా ఉద్యమించిన వీరుల,త్యాగధనుల పోరాట చరిత్ర ను నేటి తరాని కి అందించేలా పాఠ్య పుస్తకాల లో పోరాట చరిత్ర ను పాఠ్యాంశాలు గా చేర్చాల ని డిమాండ్ చేశారు.ఆనాటి చరిత్ర కు సాక్షీభూతం గా నిలిచిన స్థలాల ను,ప్రాంతాల ను స్పూర్తి కేంద్రాలు గా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర,జిల్లా నాయకులు పరుపాటి రాంమోహన్ రెడ్డి,15 వ,వార్డు కౌన్సిలర్ కొలుపుల శంకర్,బొచ్చు సురేష్,కస్తూరి పులేందర్, అలిసేరి రవిబాబు, మంగళపళ్ళి యాకయ్య, అన్నం మధుసూదన్ రెడ్డి, గుడిమళ్ళ వెంకటేశ్వర్లు, గడ్డల శేఖర్,నడిగడ్డ ఉపేందర్,మూల శేఖర్, జలగం రవి,వినయ్ కుమార్ శర్మ,కాగు నవీన్,నడిగడ్డ సందీప్,నూకల నవీన్,శివసాయి,విన్ను,శివ, ఏం.హరీష్ గౌడ్, కొండ యాకన్న,అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
—
Sent from Email.Avn for mobile