బిజెపికి తగిన గుణపాఠం చెప్తాం – ఆనంద్ రావు
కూసుమంచి ఆగస్టు 10 ( జనం సాక్షి ): ఎస్సీ మాదిగ, మాది ఉప కులాలను ఎస్సీ వర్గీకరణ ద్వారా అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపు పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ నేడు ఎస్సీ వర్గీకరణ మరచి ఎస్సీలను మోసం చేయడంలో బిజెపి పార్టీ నెంబర్ వన్ స్థానంలో ఉందని మహాజన సోషలిస్టు పార్టీ పాలేరు డివిజన్ ఇంచార్జ్ వంగూరి ఆనందరావు అన్నారు. మండలంలోని ఎస్సీ మాదిగ మాదిగ ఉప కులాలు గత 21 రోజులుగా ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేయాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు గత నెల 18వ తేదీన ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు మంగళవారం తో నిర్వదిక వాయిదా పడటంతో ఆగ్రహించిన దీక్షాపరులు ర్యాలీతో తాసిల్దార్ కార్యాలయం చేరుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ మాదిగ మాదిగ ఉపకులాలను మోసం చేసి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ రాష్ట్రంలో కూడా మాయమాటలు చెప్పే అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ పార్టీకి రానున్న శాసనసభ పార్లమెంటు ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తామని వారు బిజెపి పార్టీ ని హెచ్చరించారు. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత లేక ప్రతి సారి ఏదో ఒక సాకుతో మూలన పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగ మాదిగ ఉపకులాలకు సరియైన ప్రాధాన్యత లేకపోవడంతో ఉద్యోగ, విద్య, ఆర్థిక రంగాలలో వెనుకబడియున్న మమ్ములను ఆదరించకపోవడం ఎస్సీ మాదిగ మాదిగ ఉప కులాలను బిజెపి పార్టీ అవమానించడమేనని వారు తమ నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కో కన్వీనర్ కనకం భాస్కర్, గణేష్ ,సుందరయ్య ,వెంకన్న ,సురేష్ , శంకర్, వీరశంకర్ , నాగేంద్రబాబు, పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.