బిజెపి నేతలవి పగటి కలలు

ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
రేగొండ మండలంలో కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
రేగొండ (జనం సాక్షి) : రెండు సీట్లు గెలవగానే రాష్ట్రంలో మొత్తం మేమే గెలుస్తామనే విధంగా బిజెపి నేతలు పగటి కలలు కంటున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని సుల్తాన్పూర్, గోరుకొత్తపల్లి, చిన్నకోడపాక, రేగొండ, కొత్తపల్లి బి గ్రామాలలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై చెక్కుల పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్న ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా అమలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని పలు సందర్భాల్లో ప్రశంసాలు ఇచ్చిన కేంద్ర మంత్రులు రాష్ట్రంలో రెండు సీట్లు గెలవగానే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు అని, ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి లేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన బిజెపి కేంద్రమంత్రులు ఇప్పుడు కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని మాట్లాడడం సిగ్గు చేటు అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా వ్యవసాయ రంగానికి పుష్కలంగా నీళ్లు అందుతున్నాయని, హైదరాబాద్ వంటి నగరాలకు తాగునీరు, పరిశ్రమలకు నీరు అందిస్తున్నామని అన్నారు. మెదక్, రంగారెడ్డి జిల్లా వరకు కూడా నీళ్లు వెళ్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించిందని, ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేసే బండాగారంగా తెలంగాణ రాష్ట్రం పేరు పొందుతుందని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల కోసం మంచి పనులు చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థించకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్న పార్టీలకు ప్రజలే గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విభజన చట్టంలో పెట్టినప్పటికీ కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం లేదని ఆరోపించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి ఏర్పాటుకు ఉసే లేదన్నారు. ములుగు జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇప్పటివరకు నిధులు కేటాయింపు లేదని అన్నారు. కొద్ది రోజుల్లో గోరుకొత్తపల్లి మండలం ఏర్పాటు ప్రక్రియ జరుగుతుందన్నారు. వారం రోజుల్లో గ్రామ గ్రామాన తిరిగి కొత్త పెన్షన్స్ ఇస్తామని, పెన్షన్లు రానివారికి అప్లికేషన్ తీసుకొని అందరికీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మి రవి, జడ్పిటిసి సాయిని విజయ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు హింగే మహేందర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు మటిక సంతోష్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు పాత పెళ్లి సంతోష్, అంబాల చందు, చిగురు మామిడి రజిత రాజు, లింగం పల్లి శ్వేత రాజు, ఇంద్ర బాపు రెడ్డి, దండ బోయిన సంతోష్, గుండు బుచ్చక్క, ఐలయ్య, భాగ్యలక్ష్మి, నీల నిలబ్రం, ఎంపిటిసిలు మై సా సుమలత బిక్షపతి, కేసిరెడ్డి ప్రతాప రెడ్డి, ఐలి శ్రీధర్ గౌడ్, దుగ్యాల సునీత రాజేశ్వర్ రావు, గండు కుమార స్వామి, హమీద్, సందెల స్వప్న రాంబాబు, జూపాక రమేష్, బొట్ల కవిత సామ్రాట్, జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎండి రహీం,పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ కోలే పాక బిక్షపతి, సర్పంచుల పోరం మండల అధ్యక్షులు దాసరి నారాయణ రెడ్డి,నాయకులు బండి కిరణ్, గంజి రజినీ కాంత్, పట్టెం శంకర్, గుండు సదనదం,బండి రమేష్, కొడే పాక మొగిలి, గండి తిరుపతి, కిరణ్, సమ్మయ్య తది తరులు పాల్గొన్నారు.