బిజెపి పార్టీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధం- సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

బిజెపి పార్టీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధం- సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ*
*ప్రధాని నరేంద్ర మోడీకి నిజమైన మిత్రుడు ఎంపి అసదుద్దీన్ ఓవైసీ- సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : బిజెపి పార్టీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తారీకు వరకు జరిగే సిపిఐ పార్టీ రాష్ట్ర మూడవ మహాసభకు సంబంధించి ఏర్పాట్లను శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని మల్లికా కన్వెన్షన్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తో కలిసి పరిశీలించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రాజకీయాల పూర్తిగా హైజాక్ అయ్యాయని ఇప్పుడు తెలంగాణలో రాజాసింగ్ ను ముందు పెట్టి ఆర్ఎస్ఎస్ ఆడుతున్న నాటకం అన్నారు. రాజా సింగ్ తో స్టేట్మెంట్లు ఇప్పించి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్ర పండుతుందన్నారు. రాష్ట్రంలో ఎంఐఎం, ఆర్ఎస్ఎస్ నిజమైన శత్రువులు కాదని మిత్రులు అన్నారు. మోడీకి నిజమైన మిత్రుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వీరిద్దరూ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బిజెపి, ఎంఐఎం ఒక్కటై మతాల మధ్య చిచ్చుపెట్టి కుట్రపూరితమైన రాజకీయం చేస్తుందని అన్నారు. కెసిఆర్ ఇతర రాష్ట్రాలలో పర్యటించే బిజెపి వ్యతిరేకంగా కూటమి కట్టడం మంచి పరిణామం ఉన్నారు. దేశంలో బిజెపికి వ్యతిరేకంగా ఎవరు కలిసి వచ్చిన వారితో కలిసి పోరాటానికి సిపిఐ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. బిజెపి పార్టీకి ఏ పార్టీ మద్దతు ఇచ్చిన వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మా పార్టీ టిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికిందని మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజిత్ భాష, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, సిపిఐ పార్టీ రాష్ట్ర ఆహ్వాన సంఘం కార్యదర్శి పానుగంటి పర్వతాలు, పుస్తకాల నర్సింగ్ రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జైపాల్ రెడ్డి, సిపిఐ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : శంషాబాద్ లోని మల్లిగా కన్వెన్షన్ లో జాతీయ సమావేశాల ఏర్పాట్లను పరిశీలిస్తున్న సిపిఐ జాతీయ, రాష్ట్ర నాయకులు.