బియ్యం ఎగుమతుల ఆంక్షలపై గందరగోళం
` బియ్యం ఎగుమతులపై మొన్న ఆంక్షలు..
` ఇప్పుడేమో సింగపూర్‌కు ప్రత్యేక అనుమతులు
` రాబోవు రోజుల్లో చక్కెరపైనా ఆంక్షలు విధించే అవకాశం
న్యూఢల్లీి(జనంసాక్షి):కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందో అర్థం కావడంలేదు. ముఖ్యంగా ధాన్యం విషయంలో గందరగోళ ప్రకటనలు, నిర్ణయాలతో ప్రజలను తికమకపెడుతోంది. మోదీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజలే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా తిప్పలు పడాల్సి వస్తోంది. నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయని ఏడాదిన్నర క్రితం చెప్పిన కేంద్రం.. ఇప్పుడు ధాన్యం కొరతను అంగీకరిస్తూ బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధిస్తోంది. అదేం అని ప్రశ్నిస్తే.. దేశంలో సరిపడా ధాన్యం ఉంచేలా చూడటంతో పాటు ధరల నియంత్రణ కోసమే ఇలా చేస్తున్నట్లు చెబుతోంది. ఈ నేపథ్యంలోనే నెల రోజుల క్రితం పలు రకాల బియ్యం ఎగుమతులపై నిషేధాలు, ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో విదేశాల్లో బియ్యానికి డిమాండ్ పెరిగింది. చాలా దేశాల్లో కొరత ఏర్పడిరది. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో బియ్యం కోసం ప్రజలు సూపర్ మార్కెట్లకు పోటెత్తుతున్నారు. దాదాపు అన్ని దేశాల్లో బియ్యం నిల్వలు అడుగంటాయి. ఇలాంటి సమయంలో కేంద్ర తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.అన్ని దేశాలకు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. ఒక్క సింగపూర్ కు మాత్రం ఆంక్షలు, నిషేధాల నుంచి మినహాయింపు ఇస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు, మైత్రి దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘సింగపూర్‌తో ఉన్న ప్రత్యేక సంబంధాల దృష్ట్యా ఆగ్నేయ దేశంలోని ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి బియ్యం ఎగుమతిని అనుమతించాలని నిర్ణయించాం’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.‘భారతదేశం, సింగపూర్ దేశాలు చాలా సన్నిహిత, ఆర్థిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ప్రత్యేక సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆహార భద్రత అవసరాలకు అనుగుణంగా బియ్యం ఎగుమతిని అనుమతించాలని భారతదేశం నిర్ణయించింది’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, అరిందమ్ బాగ్చి మంగళవారం సింగపూర్‌కు బియ్యం ఎగుమతిపై విూడియా ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలో జారీ చేయనున్నట్లు వెల్లడిరచారు.కాగా, నెల క్రితం బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉప్పుడు(పారాబాయిల్డ్) బియ్యం ఎగుమతులపై కూడా 20% పన్ను విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా బాస్మతి బియ్యం ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. నూకల ఎగుమతులపై గత ఏడాది కేంద్రం నిషేధం విధించింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత్.. ఇప్పుడు అన్ని రకాల బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.భారతదేశానికి అన్నపూర్ణగా పేరున్నది. ప్రపంచంలోనే బియ్యం ఎగుమతుల్లో 40శాతంతో అగ్రస్థానంలో ఉండే భారత్.. ఇప్పుడు ప్రతి బియ్యం రకం ఎగుమతులపై ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి నెలకొన్నది. తమ వద్ద ఉన్న పారాబాయిల్డ్ బియ్యాన్ని తీసుకోండని తెలంగాణ ప్రభుత్వం కోరుతూనే ఉన్నా.. మాకొద్దని తెగేసి చెప్పిన కేంద్రం.. ఇప్పుడు అదే పారాబాయిల్డ్ రైస్ ఎగుమతులపై 20 శాతం సుంకం విధించడం కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని చెప్పడానికి నిదర్శనం.అంతర్జాతీయ బియ్యం వ్యాపారంలో భారత్ 40 శాతం వాటా కలిగివున్నది. భారత్ నుంచి అమెరికా, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, బంగ్లాదేశ్, చైనా, నేపాల్, ఆఫ్రికన్ తదితర దేశాలు పెద్దమొత్తంలో బియ్యం దిగుమతి చేసుకొంటున్నాయి. 2022`23లో భారత్ ఇతర దేశాలకు 177.9 లక్షల టన్నుల బాస్మతీయేత బియ్యం, 45.6 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. బియ్యం ఎగుమతులపై భారత్ నిర్ణయాల వలన పలు దేశాల్లో ఆహార సంక్షోభం పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.బియ్యం ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షల కారణంగా అంతర్జాతీయ బియ్యం మార్కెట్ కుదుపునకు లోనైంది. బియ్యం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బియ్యం ధరలు 12 ఏండ్ల గరిష్ఠానికి చేరాయి. గత నెల బాస్మతీయేతర తెల్ల బియ్యంపై భారత్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో అమెరికాలో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వరిసాగు వద్దనడంతో చాలా రాష్ట్రాలు సాగును తగ్గించాయి. దీంతో దేశవ్యాప్తంగా సాగు శాతం భారీగా పడిపోయింది. ధాన్యం ఉత్పత్తి తగ్గిపోయి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంతో వ్యవసాయాన్ని గాడిన పెట్టి, ధాన్యం ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవడం చేతకాని కేంద్రం.. ఎగుమతులపై ఆంక్షలు విధిస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. మరోవైపు కేంద్రం నిర్ణయాలు రైతులకు శాపంగా మారనున్నాయి. ఎగుమతుల కోసం వరి ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తే.. రైతుకు కొంత మేర మంచి ధర లభిస్తుంది. అయితే ఇప్పుడు ఎగుమతులపై నిషేధం, ఆంక్షలు వంటి కారణాలతో వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. దీని వలన ధర విషయంలో రైతులు నష్టపోవాల్సి వస్తుంది.రాబోవు రోజుల్లో పంచధార ఎగుమతులపై కూడా భారత్ నిషేధం విధించే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కేంద్రం ఇప్పటికే ఉల్లి ఎగుమతులపై కూడా 40 శాతం సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.