బిల్డింగ్‌ పైనుండి దూకేస్తానని టిడిపి ఎమ్మెల్యే హంగామా

ఏలూరు : పశ్చిమ గోదావరిజిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యడు టివి రామారావు గురువారం అర్డీవో కార్యాలమం పైకి ఎక్కి హంగామా స్పష్టించారు. దీపం పథకంలో తన నియోజకవర్గాన్ని అధికారులు నిర్లక్యం చేస్తున్నారని నీలం తుఫాను బాధితులకు పరిహరం పెంచాలని డిమాండ్‌ చేస్తూ అయన కార్యాలయం పైకి ఎక్కారు. తన డిమాండ్లకు అనుకూలంగా స్పందించకుంటే తీవ్రంగా స్పందిస్తానని చెప్పారు.అవసరమైతే పై నుండి దూకుతానని హెచ్చరించారు.దీపం పథకంలో తన నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందన్నారు. దళితుడిని,ప్రతిపక్ష శాసనసభ్యుడిని కాబట్టే తన పట్ల వివక్ష చూపిస్తున్నారని అరోపించారు. తమకు ఓట్టువేసిన ప్రజలే అధికార పక్షానికి వేశారని, తమకు ఓటేసిన వారిని, వారికి ఓటేసిన వారిని వేర్వేరుగా చూస్తేఅది ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు. ఓట్లు వేసి గెలిపించినప్పుడు అ ప్రజల బాద్యత తన పైనే ఉంటుందన్నారు.అందుకే తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలని భవనంపైకి ఎక్కినట్లు చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు తన వద్దకు వస్తున్నారన్నారు. మీ చేతులారా ఓ ఎమ్మెల్యేను పోగోట్టుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్న చెడ్డపేరు రావాలన్న అధికారుల పని తీరుపైనే అధారపడి ఉంటుందన్నారు. అన్నపూర్ణగా పేరోందిన ఉభయ గోదావరి జిల్లాల్లోనే వరదలు వచ్చినప్పుడల్లా ఎక్కువ నష్టం జరుగుతోందన్నారు.వర్షాల వల్ల భారీగా వచ్చే వరద నీరు ముందు మమ్మల్ని ముంచిన తర్వాతనే సముద్రంలో కలుస్తోందని అవేదన వ్యక్తం చేశారు. అధికారులు వ్యవసాయ క్షేత్రాల నుండి నీరు అంతా వెలిసిపోయాక వచ్చి పంటలు ఎక్కడ మునిగాయని ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల జీవితాలతో అడుకోవద్దన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10,000 చెల్లించాలని డిమాండ్‌చేశారు. కాగా కాసేపటికి అధికారులు నీలం తుఫాను బాధితులను అదుకుంటామని హమీ ఇవ్వడంతో ఎమ్మెల్యే కిందకు దిగి వచ్చారు.