బి ఆర్ ఎస్ పార్టీ నాయకుల సంబరాలు ఫోటో రైట్ అప్ :

1.టపాసులు కాలుస్తూ సంబరాల్లో పాల్గొన్న బి ఆర్ ఎస్ నాయకులుచొప్పదండి, ఆగస్టు 21 (జనం సాక్షి): చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద టపాకాయలు కాలుస్తూ, స్వీట్లు తినిపిస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుంకె శంకర్ స్థానికంగా ఉంటూ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంటున్నాడని అన్నారు. గతంలో నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని చొప్పదండి నియోజకవర్గ కేంద్రాన్ని సుమారు 120 కోట్లతో అభివృద్ధి చేసి చూపిస్తున్న ఘనత ఎమ్మెల్యే కే దక్కుతుందని కొనియాడారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులే ఆయనకు మళ్ళీ రెండవసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ సీఎం కేసీఆర్ ఇచ్చారని అన్నారు. రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ ఏకమై బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ వైస్ చైర్ పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, సింగల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, ఆర్ బి ఎస్ మండల కన్వీనర్ గుడిపాటి వెంకట రమణారెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ ఇన్చార్జ్ బంధారపు అజయ్,
సర్పంచులు వెల్మ నాగిరెడ్డి, పెద్ది శంకర్, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణ హరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, నాయకులు మాచర్ల వినయ్, మహేష్ ని మల్లేశం, ఏనుగు స్వామి రెడ్డి, చీకట్ల లచ్చయ్య, గాండ్ల లక్ష్మణ్, దండే కృష్ణ, అజ్జు, రాపల్లి ఐలయ్య, నేరుమట్ల మల్లేశం,
ఉసేమల్ల మధు, సుధాకర్ రెడ్డి, రావణ్, రాజశేఖర్, నరేష్ , నరసయ్య తిరుపతి,మల్లేశం తదితరులు పాల్గొన్నారు