బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం

బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. మంథని నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాల్లోని కాంగ్రెస్‌ బీజేపీ శ్రేణులు ఆ పార్టీలను వీడి బీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారు. ఇటీవలి కాలంలో మంథని, ముత్తారం, మల్హర్‌ మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తాజాగా ముత్తారం మండలం అడవి శ్రీరాం పూర్ గ్రామానికి చెందిన సుమారు 50మంది కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు మరియు మంథని మండలం సూరయ్య పల్లె గ్రామానికి చెందిన సుమారు 30 మంది వివిధ పార్టీల కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. మంథనిలోని రాజగృహాలో జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృధ్ది, సంక్షేమ పథకాల అమలుతో పాటు నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ చేస్తున్న సేవలకు ఆకర్షితులై ఆయనకు అండగా నిలువాలని బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. నియోజకవర్గ అభివృధ్ది, ఈ ప్రాంతంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్న జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌కు అండగా నిలిచి ఆయన గెలుపు కోసం తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్బంగా వారు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో మంథని గడ్డపై గులాభీ జెండా ఎగురడం, పుట్ట మధు గెలుపు ఖాయమని వారు తెలిపారు.

తాజావార్తలు