బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కండువా కప్పిన ఝాన్సీ రెడ్డి- పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అధ్వర్యంలో కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ కార్యకర్తలు…- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఝన్సిరెడ్డి
దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి ఎంపీటీసీ పరిధిలోని ధారావత్ తండా, చింతాబాయి తండా, నల్లకుంట తండా, దొడ్లబండ తండా, కొత్త తండా, గోప్యానాయక్ తండా నుండి పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ లంబాడా గిరిజన ప్రజలను బిఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీయే లంబాడా ప్రజల సంక్షేమానికి తోడ్పడిందని
అందుకే బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నమని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో దయాకర్ రావును,బిఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని పెద్ది కృష్ణమూర్తి లంబాడాలకు పిలుపునిచ్చారు. హనుమండ్ల ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం లంబాడాలకు తీవ్ర ద్రోహం చేసిందని అభివృద్ధికి దూరంగా కనీస మౌలిక సదుపాయాలు అయిన విద్య, వైద్యం, తాగునీరు కూడా కల్పించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎస్సీ డిక్లరేషన్లో చెప్పినట్టుగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం, అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు.అర్హులు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లులేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు అందజేస్తామని తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను తిరిగి లబ్ధిదారులకు అన్ని హక్కులతో పునరుద్ధరిస్తామని అర్హులైన అందరికీ పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని సమ్మక్క – సారలమ్మ గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు ఏటా రూ.25 లక్షలు కేటాయిస్తామని అంబేడ్కర్ అభయహస్తం పథకం ద్వారా ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు.ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్స్, విదేశాల్లో విద్య ప్రతి మండలంలో ఒక గురుకులం ఉండేలా ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు, గ్రాడ్యుయేషన్, పీజీ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వసతి కల్పిస్తామని తెలిపారు. బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినవారిని ఈ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి అభినందించారు.తమ చేరిక కోసం సహకరించిన మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి,తెలంగాణ ఉద్యమకారుడు,పాలకుర్తి నియోజకవర్గ నాయకుడు ఇప్ప పృథ్వి రెడ్డికి బిఆర్ఎస్ ను వీడిన వారికి కృతఙ్ఞతలు తెలియజేసారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు ఆ పార్టీ పూర్వ అధ్యక్షుడు బిక్య నాయక్, టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆంబోతు రాజు, మాజీ ఆదర్శ రైతు కునుశోతు రాము, సీనియర్ నాయకులు కైలా, కిషన్, పరమేష్, మీనా, రమేష్, హరియా, జితేందర్, భూక్యా యాకుబ్, శివాజీ, రాజా, అంగోత్ కిషన్, తదితరులు పాల్గొన్నారు.