బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం-బహిరంగ సభ దిగ్విజయం కావాలని ప్రత్యేక పూజలు.

తొర్రూర్ 27 జూన్ (జనంసాక్షి )జులై 2 ,3 తేదీల్లో హైదరాబాద్ లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు-ప్రదాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ ఎలాంటి విఘ్నాలు లేకుండా, అడ్డంకులు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఈ రోజు తొర్రూర్ లో స్థానిక పాటిమీద హనుమాన్ మరియు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కేసిఆర్ నియంత్రృత్వ అహంకార పాలనకు చరమగీతం పాడి రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో పేదల ప్రభుత్వం రాబోతుంది అని దీనికి అనుగుణంగా జాతీయ పార్టీ ప్రత్యేక ద్రృష్టి సారించింది అని తెలిపారు.జులై2,3తేదీలలో హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.ఈకార్యవర్గ సమావేశాలకు చివరి రోజైన జులై 3న పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని ఈసభకు బీజేపీ రాష్ట్ర జిల్లా మండల  శక్తి కేంద్రాలు ఇంఛార్జి, బూత్ కమిటీ సభ్యులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు శ్రేయోభిలాషులు విద్యార్థులు యువత పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈనెల 30,31తేదీలలో రాష్ట్రంలో ఉన్న ప్రతీ అసెంబ్లీ కి ఒక కేంద్ర మంత్రి లేదా, ముఖ్య మంత్రులు లేదా,మాజీ ముఖ్యమంత్రులు లేదా జాతీయ పార్టీ ముఖ్య నేతలు రెండు రోజుల పాటు పర్యటించి పార్టీ పటిష్టత కోసం పనిచేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని కల్పిస్తూ,కార్యకర్తలతో మమేకమై వారు పార్టీ పురోభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రేరణ కల్పించి తెలంగాణ లో కాషాయ జెండా ఎగురవేసి బీజేపీ నేతృత్వంలో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు అని తెలిపారు.హైదరాబాద్ లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగకుండా కేసీఆర్ కుటుంబం కుట్రలు పన్నుతూ చిల్లర మల్లర పనులకు పాల్పడుతూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని, టీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మరియు ప్రధాని నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ దిగ్విజయం అవుతుంది అని కార్యకర్తలు క్రమశిక్షణతో,కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, జిల్లా కార్యదర్శి పరుపాటి రాం మోహన్ రెడ్డి,15వ వార్డు కౌన్సిలర్ కొలుపుల శంకర్, ఎస్సీ మోర్చ మహా బాద్ పార్లమెంట్ ఇంఛార్జి అలిసేరి రవిబాబు, జిల్లా నాయకులు గుడిమళ్ళ వెంకటేశ్వర్లు,అర్బన్ ప్రధాన కార్యదర్శి పైండ్ల రాజేష్, కార్యదర్శి జలగం రవి, ఎస్టీ మోర్చ జిల్లా కార్యదర్శి రాయపురంరాజకుమార్, బీజేవైఎం అర్బన్ అధ్యక్షుడు కాగు నవీన్, ప్రధాన కార్యదర్శి నూకల నవీన్, తదితరులు పాల్గొన్నారు.