బీసీలకు అన్యాయం చేస్తే పోరాటమే: పొన్నం

కరీంనగర్‌: బీసీలకు అన్యాయం చేస్తే పోరాటం తప్పదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. బీసీల జనాభా 52శాతం ఉంటే బడ్జెట్‌లో 2శాతం నిధులు కేటాయించారని అన్నారు. బీసీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా బీసీని నియమించాలని డిమాండ్‌ చేశారు.