బీసీలు రాజకీయ రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కోసం బీసీలు ఉద్యమించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్క వెంకట్ యాదవ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య యాదవ్ అన్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు గడుస్తున్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడం చాలా బాధాకరమన్నారు.జెండాలు మోసే కార్యకర్తలుగా ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారని అన్నారు.బీసీల కోసం రాజకీయ రిజర్వేషన్లు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.బీసీలు వచ్చే ఎన్నికల్లో ఏకతాటిపై వచ్చి బీసీల హక్కుల కోసం పోరాల్సిన సమయము వచ్చిందన్నారు.రాజకీయ రిజర్వేషన్ల సాధనకై నేటి నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా , పార్లమెంట్ ముట్టడి, అఖిలపక్ష సమావేశాలు వంటి పలు కార్యక్రమాలను ఢిల్లీలో చేపట్టడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమాలకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో పెద్ద ఎత్తున బీసీ నాయకులు ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరినట్లు తెలిపారు.ఢిల్లీకి వెళ్లిన వారిలో
ఆవుల నాగరాజు, పచ్చిపాల మధు, భారీ అశోక్ కుమార్, తగుల జనార్ధన్, గణేష్, గోవర్ధన్,బయ్య రాజేష్ ,  పరాల సాయి తదితరులు ఉన్నారు.