బీసీసీఐ అధ్యక్ష ఎన్నిక లో రసవత్తర పోటీ

0000బీసీసీఐ అధ్యక్ష ఎన్నిక లో జరుగుతున్న రసవత్తర పోటీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మళ్లీ బోర్డ్ లో తెరవెనుక నుంచైనా చక్రం తిప్పేందుకు నానా తంటాలు పడుతున్నా శ్రీనివాసన్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది.. బోర్డ్ పగ్గాల కోసం ఏకం శరద్ పవార్ అండదండలు ఆశించిన శ్రీనికి అదే వర్గం అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది..అతని బద్ధ శత్రవు శశాంక్ మనోహర్ పేరు తెరపైకి తీసుకువచ్చింది.

అయితే శ్రీనివాసన్ దూకుడుకు అడ్డుకట్ట వేసే మాస్టర్ ప్లాన్‌లో భాగంగానే శశాంక్ మనోహర్ పేరు తెరపైకి తీసుకువచ్చినట్లు సమాచారం.. దీనికి తోడు బెంగళూర్ లో శ్రీనివాసన్ నిర్వహించిన సమావేశానికి ఈస్ట్ జోన్ నుంచి కేవలం ఒకే సంఘం హాజరు కావడం.. ఇప్పుడు పవార్ వర్గం చేయివ్వడంతో శ్రీనివాసన్ ఒంటరయ్యాడు.

ఇక బీసీసీఐ మిస్టర్ క్లీన్ గా పేరుగాంచిన మనోహర్‌కు మిస్టర్ క్లీన్‌గా పేరుంది. ఇప్పటికే ఓ సారి బీసీసీఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించిన మనోహర్.. బోర్డ్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు.. ప్రతిష్టాత్మక ఐపీఎల్ పురుడు పోసుకుంది.. మనోహర్ హయాంలోనే..ఇక మనోహర్ బోర్డ్ ప్రెసిడెంట్ గా ఉన్న 2008 నుంచి 20011 వరకు బోర్డ్ లో ఎలాంటి అవినీతి లేకుండా సాఫీగా సాగింది.. ఇక అధ్యక్షుడిగా వైదొలిగిన తర్వాత మళ్లీ ఐపీఎల్ అవినీతి మచ్చపడ్డ ఐపీఎల్‌ను క్లిస్టర్ క్లియర్‌గా మళ్లీ సక్సెస్ పట్టాలెక్కించడంలో మనోహర్ కీలక పాత్ర పోషించాడు.

ఇక శశాంక్ మనోహర్ శ్రీనివాసన్ కు బద్ద శత్రువుగా పేరుగాంచిన శశాంక్ మనోహర్.. ఐపీఎల్ కుంభకోణంలో తొలిసారిగా శ్రీనివాసన్ కు వ్యతిరేకంగా గళమెత్తాడు.. అధ్యక్షపదవి నుంచి శ్రీని తప్పుకోవాలని గట్టిగా పోరాడి సక్సెస్ అయ్యాడు.. దీంతో ప్రస్తుత బోర్డ్ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ సైతం శశాంక్ మనోహర్ అయితే చీఫ్ పదవికి కరెక్ట్ సూటబుల్ అని అభిప్రాయపడ్డట్లు సమాచారం.

ఓవరాల్ గా శశాంక్ మనోహర్ ఎంట్రీతో శ్రీనివాసన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది..ఇప్పటికే కోర్ట్ కేసులు, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మనోహర్ బోర్డ్ పగ్గాలు చేపడితే శ్రీనివాసన్ మరింత ఇరకాటంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది