బీసీ రిజర్వేషన్ నిలపివేతపై భగ్గుమన్న బీసీ సంఘాలు

` హైకోర్టు తీర్పుతో 56 శాతం బీసీ ప్రజల హక్కులకు విఘాతం
` ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ బంద్ ప్రకటిస్తామని హెచ్చరిక
` ఆదరబాదరగా స్టే విధించాల్సి రావడం బాధాకరంమని వ్యాఖ్య
` బీసీ బిసి రిజర్వేషన్లపై చిత్తశుద్దిలేని కాంగ్రెస్: ఈటెల
హైదరాబాద్(జనంసాక్షి):హైకోర్టు నిర్ణయం నిర్ణయం రాష్ట్రంలోని 56 శాతం బీసీ ప్రజల హక్కులకు విఘాతం కలిగించిందని. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని, బీసీల నోటికాడి అన్నం ముద్దను లాక్కున్నారని రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమాజంలో బీసీల సత్తా ఏంటో చూపిస్తాం. స్టే విధించడం చాలా దురదృష్టకరం. రేపట్నుంచి రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించిన విషయం తెలిసిందే.తాజాగా ఈటల మాట్లాడుతూ బీసీల పట్ల కాంగ్రెస్‌కు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పరువు తీసుకుందన్నారు. కాంగ్రెస్ ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తుందని ఎవరూ అనుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి వంచించారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు సలహాలు ఇచ్చింది ఎవరో అర్థం కాలేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ అంశం రాజ్యాంగానికి సంబంధించినదన్నారు. రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే.. ఢల్లీిలో ధర్నా ఎందుకు చేశారో తెలియదన్నారు. కాంగ్రెస్ నేతలు చెంపలేసుకుని.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరిపించాలని పట్టుబడ్డారు. హావిూ ఇచ్చే ముందు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లోపు పాత సర్పంచ్‌లకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఎంపీ డిమాండ్ చేశారు. ’హుజురాబాద్‌లో బీ ఫామ్స్ నేనే ఇస్తా.. ఇక్కడ నేను 25 ఏళ్లుగా లీడర్‌ను.. నేను కాకుండా బీ ఫామ్స్ ఇంకెవరు ఇస్తారు’ అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.బీసీలను బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయని భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్, బీ ఆర్‌ఎస్ జీన్స్ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్ పరిధి జిల్లాల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాజపాతోనే బీసీలకు న్యాయం జరుగుతుందనే నిర్ణయానికి ప్రజలు కూడా వచ్చారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుస్తామనే నమ్మకం తమకు ఉందని చెప్పారు. నగరాన్ని ప్రపంచానికే తలమానికంగా మారుస్తామని భారత రాష్ట్ర సమితి గతంలో చెప్పింది.. కానీ అందుకు అనుగుణంగా ఎలాంటి ముందడుగు పడలేదు. కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడానికి ఎన్నో హావిూలు ఇచ్చింది. ఓట్ల కోసం ఈ రెండు పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు దిగాయి. రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తాం. ఈ ఉప ఎన్నికలో గెలిచి ప్రధాని మోదీకి గిప్ట్‌గా ఇవ్వాలి. రేపటి నుంచి కార్యకర్తలు, నేతలు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేయాలి. కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి లోపాయికారీ ఒప్పందాన్ని తిప్పికొట్టాలని రామచందర్‌రావు కోరారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణ రాష్ట్రంలో సిద్దంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో తాము గెలుస్తామని పూర్తి నమ్మకం ఉందని, ప్రజలపై విశ్వాసం ఉందని ఉద్ఘాటించారు. విశ్వనగరం పేరుతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు నగర ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నాయని ఆక్షేపించారు. వర్షం వస్తే ప్రాణాలు పోయే పరిస్థితులు నగరంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎర్రగడ్డలో కాలనీల మధ్య ముస్లింలకు శ్మశాన వాటికలు ఎలా కేటాయిస్తున్నారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. హిందూ దేవాలయాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూల్చేస్తోందని ఆరోపించారు. నగరంలో హిందువులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి నుంచి బీజేపీ శ్రేణులు ప్రతి ఒక్కరూ జూబ్లీహిల్స్‌లో గ్రౌండ్ లేవల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మార్గనిర్దేశం చేశారు. బీసీలను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయని ధ్వజమెత్తారు. బీజేపీ వల్లే బీసీలకు న్యాయం జరుగుతోందని ప్రజలు కూడా ఈ నిర్ణయానికి వచ్చారని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాము గెలుస్తామనే పూర్తి నమ్మకం ఉందని రాంచందర్ రావు ఉద్ఘాటించారు.ఈ సమావేశానికి రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీల సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక, ప్రచార కార్యక్రమాలు, గెలుపు వ్యూహాలపై చర్చించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎలక్షన్ లో బీసీలకు 42 శాతం డిక్లరేషన్ చేస్తామని అన్నారు కానీ నేటికీ అది అమలు కాలేదని బీసీల రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకున్నారు అన్నారు. తొగుట మండల కేంద్రంలో అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ నాయకులు సమావేశమై 42 శాతం బీసీలకు కేటాయించిన రిజర్వేషన్ ఇవ్వాలని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎలక్షన్ లో బీసీలకు 42 శాతం డిక్లరేషన్ చేస్తామని అన్నారు కానీ నేటికీ అది అమలు కాలేదని బీసీల రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకున్నారు అన్నారు. స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు గ్రామస్థాయి ప్రజా ప్రతినిధుల నుండి ముఖ్యమంత్రి పదవుల వరకు కూడా అగ్రవర్ణాలే అనుభవిస్తున్నారని అన్నారు. జనాభా ప్రతిపాదికను బట్టి అగ్రవర్ణాలకు కూడా 10 శాతం రిజర్వేషన్ ప్రకటించాలని బీసీ నాయకులు అన్నారు. కొద్ది శాతం ఉన్న అగ్రవర్గాలు 90% ప్రజాప్రతినిధులుగా మీరే అనుభవిస్తున్నారని.. ఇకనుండి అగ్ర వర్గాల ఆటలు చెల్లయని రాబోయే రోజుల్లో బీసీల రాజ్యాధికారం వస్తుందని అన్నారు. అగ్రవర్గాలు బీసీల రిజర్వేషన్ల 42 శాతాన్ని అడ్డుకుంటే రాబోయే రోజుల్లో అగ్రవర్గాలకు పుట్టగతులు ఉండవు అని అన్నారు.
బీసీలకు రిజర్వేషన్ ఇస్తే అగ్రవర్ణాలకు ఆటలు చెల్లవని..
తెలంగాణ ఉద్యమం కన్నా బీసీల ఉద్యమం చాలా ఉధృతంగా ఉంటాయని అగ్రవర్ణాలను ప్రతి గ్రామంలో తిరగనియ్యమని బీసీ నాయకులు హెచ్చరించారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్ 42 శాతానికి అమలు చేస్తూ బీసీలకు సహకరించాలని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తే అగ్రవర్ణాలకు ఆటలు చెల్లవని కుట్రతో బీసీల రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాతుకుల వెంకటేశం, సిరినేని గోవర్ధన్, చిక్కుడు చంద్రం ముదిరాజ్, గొడుగు ఐలయ్య ముదిరాజ్, కురుమ యాదగిరి.ఐలగొండ చంద్రశేఖర్ గౌడ్. తగరం అశోక్. చిక్కుడు బాలమల్లు. ముచ్చర్ల ఆంజనేయులు యాదవ్. ప్రసాద్. తదితరులు పాల్గొన్నారు.
14న తెలంగాణ బంద్..!
` పిలుపునిచ్చిన బీసీ సంఘాలు
` బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు స్టేపై మండిపాటు
హైదరాబాద్(జనంసాక్షి): బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన హైకోర్టు స్టేపై బీసీ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఈ మేరకు బీసీ సంఘం నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఈనెల 14న బంద్‌కు పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల అంశం తేలకుండా పాత పద్ధతి ప్రకారం ఎన్నికలకు వెళ్తామంటే కుదరదని చెప్పారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.