బీహార్‌లో భాజపా బంద్‌ ఉద్రిక్తం

పాట్నా : జేడీయూ తీరును నిరసిస్తూ బీహార్‌లో భాజపా చేపట్టిన బంద్‌ ఉద్రిక్తంగా మారింది. బంద్‌ సందర్భంగా భాజపా-జేడీయూ మద్దతుదారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు జేడీయూ, భాజపా కార్యకర్తలు గాయపడ్డారు. రాష్ట్ర మంతటా భాజపా కార్యకర్తలు రోడ్లపైకి చేరుకుని బంద్‌ను పర్యవేక్షిస్తున్నారు. వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రైళ్ల రాకపోకలు కూడా నిలిపివేయడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. భాజపా ఆందోళనకు ధీటుగా జేడీయూ మద్దతుధారులు కూడా ప్రదర్శనలు నిర్వహించారు. పాట్నాలో ఇరుపార్టీల ర్యాలీలు ఎదురుపడటంతో భాజపా, జేడీయూ కార్యకర్తల ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలను చెదరగొట్టారు.