బుగ్గారం మండలంలో కూలిన ఫోర్త్ పిల్లర్ నక్క విజయ్ కుమార్
ధర్మపురి( జనం సాక్షి ) బుగ్గారం మండల పరిధిలో చుక్క గంగారెడ్డి అనే జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లో ఉంచిన విషయాన్ని తెలుసుకుని బహుజన్ సమాజ్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్ నక్క విజయ్ కుమార్ పోలీస్ స్టేషన్ చేరుకొని సబ్ ఇన్స్పెక్టర్ ని కలిసి గంగారెడ్డి అరెస్టుకు కారణం ఏమిటని దీని వెనుక ఎవరున్నారని సబ్ ఇన్స్పెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామపంచాయతీ నిధులు సుమారుగా 50 లక్షలు దుర్వినియోగమైనవని ఆధారాలతో నిరూపించగా జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడం దారుణం గత మూడు సంవత్సరాల నుండి స్పందించని యంత్రాంగం ప్రశ్నించిన వారిని అనగా జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచడం అప్రజాస్వామీకం డెమోక్రసీ లో మీడియా ఫోర్త్ పిల్లరని ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యన వారధిగా పనిచేసే జర్నలిస్టుకే ఈ పరిస్థితి ఏర్పడితే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారెవరు, సామాన్యుని పరిస్థితి ఏంటి, ప్రజలకు చెందవలసిన నిధులు దుర్వినియోగం అవుతుంటే బాధ్యత గల ఒక జర్నలిస్టుగా ప్రజాస్వామిక వాదిగా జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇవ్వడం తప్ప నివేదికను పరిగణలోకి తీసుకొని జిల్లా యంత్రాంగం తగిన విధంగా పనిచేయవలసిన బాధ్యత యంత్రాంగానికి లేదా..గంగారెడ్డిని అరెస్టు చేయడం ఏంటని వాపోయారు. నిజానికి పోలీసులు అరెస్టు చేయవలసింది స్టేషన్లో కూర్చోబెట్టవలసింది ప్రజల సొమ్మును అప్పనంగా కాజేస్తున్న నేరస్తులను గదా ఈ _సంఘటన దేనికి సంకేతం నేరం చేసేవారు రాజకీయంలో ఉంటే తప్పించుకోవచ్చా అని అనుమానాలు రాకముందే వారు ఎంత పెద్ద వారైనా అరెస్ట్ చేయాలని అన్నారు.ప్రజలకు పోలీసుల మీద నమ్మకం పోకముందే ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన నాయకులను అరెస్టు చేసి స్టేషన్లో కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. ఏనిపక్షములో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బుగ్గారం మండల అధ్యక్షుడు గజ్జల స్వామి, ఉపాధ్యక్షుడు దొబ్బేట సురేష్, గొల్లపల్లి మండల అధ్యక్షుడు కల్లపల్లి తిరుపతి మరియు సైదల విజయ్ తదితరులు పాల్గొన్నారు.