బూస్టర్ రాకెట్ ల్యాండింగ్ సక్సెస్

5కేప్ కనావరెల్(యూఎస్): అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు సరుకులను మోసుకెళ్లే రాకెట్‌ను నింగిలోకి పంపాక బూస్టర్ రాకెట్‌ను ప్రైవేటు అంతరిక్ష సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ తిరిగి విజయవంతంగా తొలిసారిగా సముద్ర జలాలపై తేలియాడే ప్లాట్‌ఫామ్‌పై ల్యాండ్ చేసింది. ప్రయోగించిన వెంటనే ప్రధాన రాకెట్ మరింత వేగంగా దూసుకుపోయేందుకు ఈ బూస్టర్ రాకెట్‌లు సాయపడతాయి.

తర్వాతి దశలో ప్రధాన రాకెట్ నుంచి విడిపోయి సముద్రంలో పడేలా సాధారణంగా వీటిని డిజైన్‌చేస్తారు. ఐసిస్‌కు సరుకులను తీసుకెళ్లే ఫాల్కన్9 రాకెట్ శుక్రవారం కేప్ కనావరెల్ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకుపోయాక ఈ బూస్టర్ రాకెట్ సముద్రంలోని ప్లాట్‌ఫామ్‌పై ల్యాండ్‌అయ్యింది. గతంలో ఇలా చేసిన పలు ప్రయోగాలు విఫలమయ్యాయి.