బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు:ఇద్దరి మృతి

కరీంనగర్:ఆర్టీసీ బస్ బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ దుర్ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల గాంధీచౌక్ వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో యాజమాన్యం ప్రయాణికుల సౌకర్యార్థం అద్దెబస్సులను నడుపుతుంది. హెవీ లైసెన్స్ ఉన్నవారిని డ్రైవర్లుగా, 10వ తరగతి పాసైన వారిని కండక్టర్లుగా తాత్కాలిక నియామక పద్దతిపై వీరిని నియమిస్తున్న విషయం తెలిసిందే.