బొల్లారం మున్సిపాలిటీలో “లార్డ్ స్వచ్ఛంద సంస్థ” ద్వారా పేద, నిరుపేదలను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్

   జిన్నారం జూన్ 24 (జనంసాక్షి )సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలో” లార్డ్ స్వచ్ఛంద సంస్థ” ద్వారా అనాధ నిరుపేద వృద్ధులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన లార్డ్ వృద్ధఆశ్రమం(లాల్ బహదూర్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్) బొల్లారం మున్సిపాలిటీ చైర్ పర్సన్  రోజా బాల్ రెడ్డి గారు శుక్రవారం ప్రారంభించారు.చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ అనాధ నిరుపేద వృద్ధులను తమ జీవితంలో అన్నీ కోల్పోయిన వారికి ఆఖరి కాలంలో మేము ఉన్నాము అని నమ్మకం కల్పించి! వారిని తమ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటున్న లార్డ్ స్వచ్ఛంద సంస్థ కి కృతజ్ఞతలు తెలిపారు .

ఇలాంటి సంస్థలు ఇంకా ముందుకు వచ్చి ఇలాంటి వారిని ఆదుకోవాలని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డాక్టర్ నరేష్ గౌడ్, జీవన్, భరత్, గౌతమ్ మరియు ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.