బొల్లారం 14వ వార్డు కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న బిజెపి జిల్లా సీనియర్ నాయకులు ఆనంద్ కృష్ణారెడ్డి

జిన్నారం జూన్ 19 (జనంసాక్షి )సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలోని 14 వ వార్డులో బిజెపి పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఆనంద్ కృష్ణారెడ్డి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అదే సమయంలో ఒక వృద్ధ మహిళ వయసు మీద పడిందని ఏ ఒక్క పరిశ్రమలో డ్యూటీ కి తీసుకోవడం లేదని పింఛన్ కూడా రావడం లేదని తెలపడంతో మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయండి మీకు ఏ సమయంలోనైనా నేను అందుబాటులో ఉండి నేను సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు! అలాగే చాలామంది వృద్ధాప్య పింఛన్ల కోసం చాలామంది వృద్ధులు దరఖాస్తు చేసుకున్నారు కానీ రావట్లేదు అన్నారు ఈ సమస్యపై నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.