బోథ్ ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలి..
బీజేపీ నాయకుల డిమాండ్..
బేల, ఆగస్టు ( జనం సాక్షి ) : ఆర్ ఎస్ ఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ క్షమాపణ చెప్పాలని బిజెపి మండల అధ్యక్షుడు దత్తా నికాం డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా శనివారం మండల కేంద్రము లోని అంతర్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.అనంతరం ఎమ్మెల్యే చిత్రపటాలను దహనం చేశారు.ఈ సందర్భంగా బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు దత్తా నికాం మాట్లాడుతూ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిజేవైఎం మండల అధ్యక్షుడు నవిన్ , గణేష్ బోనిగిరివార్, మోరేశ్వర్, మహేష్, అక్షయ్,ప్రదిప్ , జివన్ తదితరులు పాల్గొన్నారు…