బోదకాలు వ్యాధిని నిర్లక్ష్యం చెయ్యొద్దు

జిల్లా కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమ అధికారి డాక్టర్ మధుసూదన్

జనం సాక్షి, చెన్నరావు పేట

బోదకాలు వ్యాధిని నిర్లక్ష్యం చేయటం వల్ల రోజూ రోజుకి వ్యాప్తి చెందుతుందని డాక్టర్ మధుసూదన్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బోదకాలు వ్యాధిగ్రస్తులకు మందులు, ఆరోగ్య సంరక్షణ అవసరమైన పరికరాలు అందించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన మాట్లాడారు. ప్రజలు దోమలు వృద్ధి చెందకుండా ఇంటి పరిసరాలు చెత్త చెదారం లేకుండా చూసుకోవాలని, దోమతెరలు వాడాలని సూచించారు. వ్యాధిగ్రస్థులు కూడా ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలతో క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని వ్యాధికి గురైన ప్రాంతంలో అనగా కాలి మడుతలలో కాలి వేళ్ళ మధ్య శుభ్రాంగా కడిగి పై పూత మందు రాసుకోవాలన్నారు. వ్యాధిగ్రస్థులు ప్రభుత్వ పెన్షన్ కోసం సదరం క్యాంపు లకు వెళ్లకుండా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులను సంప్రదించసాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ల ఫోరం జిల్లా అధ్యక్షులు బాదావత్ విజేందర్ నాయక్, సర్పంచ్ మల్లయ్య, వైస్ ఎంపిపి కృష్ణారెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు రఫి, వైద్యులు ఉషారాణి, దిలీప్, ఇంచార్జి అసిస్టెంట్ అధికారి శ్రీనివాస్, సూపర్ వైజర్ సదానందం సిహెచ్ఓ వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.