బోనాల వేడుకల్లో పాల్గొన్న స్పీకర్‌

కామారెడ్డి,జూలై26(జనంసాక్షి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బోనాల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడ, దేశాయి పేట్‌, నస్రుల్లా బాద్‌లో జరిగిన బోనాల ఉత్సవాల్లో స్పీకర్‌ పోచారం పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించారు. రాష్ట్రంలోని ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్టు స్పీకర్‌ తెలిపారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.