*బోయవాడు మహర్షిగా మారి ఆదికవిగా ప్రసిద్ధి చెందిన వాల్మీకి జీవిత చరిత్ర ఆదర్శనీయం. ఎంపీపీ*

కోదాడ అక్టోబర్ 9(జనం సాక్షి)
మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితా పాల్గొని చిత్రపటానికి పూలమాల వేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మన దేశం వేద భూమి ఎందరో మహర్షుల ద్వారా మనకు పురాణాలు, ఇతిహాసాలు, మహా గ్రంథాలు లభించాయని అలా మనకు అందించిన మహా కావ్యం మహా గ్రంథం, ఆదికావ్యం రామాయణమని అలాంటి రామాయణ మహా గ్రంథాన్ని భావితరాలకు అందించిన మహనీయుడు మహర్షి వాల్మీకి అని భారతదేశ ఔన్నత్యాన్ని దశదిశలా చాటిన గొప్ప కవి వాల్మీకి అని బోయవాడు మహర్షి వాల్మీకి గా ప్రసిద్ధి చెందిన వాల్మీకి జీవిత చరిత్ర భావితరాలకు ఆదర్శప్రాయమని మహనీయులు చూపిన మార్గం అనుసరణీయమని, ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయశ్రీ ఎంపీవో పాండు రంగన్న,సూపరింటెండెంట్ వెంకన్న,రవి నాయక్,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Attachments area