బ్యాంకర్లు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలి
– ప్రజలను మోసం చేయొద్దు
– నోట్ల రద్దు తర్వాత జనం ఇబ్బంది పడుతున్నారు
– అన్ని ప్రాంతాల అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలి
– బ్యాంకర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు
– బ్యాంకర్ల తీరుపై ఆగ్రహం
– ఏపీ రుణ ప్రణాళిక విడుదల
– వార్సిక ప్రణాళిక రూ.1,94,220 కోట్లు
అమరావతి, జులై13(జనం సాక్షి) : బ్యాంకర్లు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలికాని మోసం చేయవద్దని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో రాష్ట్ర బ్యాంకుల తీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బ్యాంకర్లు ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలే తప్ప..మోసం చేయొద్దని సూచించారు. నోట్ల డిపాజిట్లపై ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉందని, పెద్ద ఎత్తున అపోహలు ప్రచారం జరుగుతున్నాయన్నారు. నోట్ల రద్దు తర్వాత జనం ఇబ్బంది పడుతున్నారని సమావేశంలో పేర్కొన్నారు. ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నామన్నారు. బ్యాంకర్లు కొన్ని ప్రాంతాలను మాత్రమే పట్టించుకుంటున్నాయని అది ఎంత మాత్రం
సరికాదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. తలసరి ఆదాయం లేని శ్రీకాకుళం లాంటి జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, విజయనగరం ఆదాయం మరీ దారుణంగా ఉందని వెల్లడించారు. వ్యవసాయంలో సుస్థిర అభివృద్ది తెచ్చామని, హార్టికల్చర్‌కు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. 34? జీఎస్‌డీపీ వ్యవసాయం నుంచే వస్తోందని చెప్పారు. పారదర్శకత పాటిస్తూ అన్నీ ఆన్‌లైన్‌లో ఉంచుతున్నామన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌తో పారదర్శకత తెచ్చామని బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు.
ఏపీ వార్షిక రుణ ప్రణాళిక విడుదల ..
ఆంధప్రదేశ్ రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను రూ.1,94,220 కోట్లుగా ఖరారుచేశారు. ఈ మేరకు అమరావతి ప్రజావేదిక హాల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ఆవిష్కరించారు. ప్రాధాన్యేతర రంగానికి రూ.50 వేల కోట్లు కేటాయించగా, భారీ పరిశ్రమలకు రూ.10,457 కోట్లు , ఎంఎస్‌ఎంఈలకు రూ.3,745 కోట్లు కేటాయించారు. మైక్రో ఎంటర్ ప్రైజెస్‌కు రూ.14,028 కోట్లు, స్మాల్ ఎంటర్ /-రెల్గ/జెస్‌కు రూ.11,500 కోట్లు, విూడియం ఎంటర్ ప్రైజెస్‌కు రూ.2,733 కోట్లు కేటాయించారు. మొత్తం ఎంఎస్‌ఎంఈ రుణాలు రూ.28,261 కోట్లు కాగా వ్యవసాయ రుణ ప్రణాళిక మొత్తం రూ.1,01,564 కోట్లుగా తేల్చారు. స్వల్పకాలిక ఉత్పాదక రుణాలు రూ. 75,000 కోట్లు కాగా.. వీటిలో కౌలు రైతులకు ఆర్థిక సాయంగా రూ.7,500 కోట్లు కేటాయించారు. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు రూ.21,323 కోట్లు కేటాయించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలు రూ.241 కోట్లు, అనుబంధ కార్యక్రమాలకు రూ.5వేల కోట్లు, మొత్తం వ్యవసాయ రుణాలు రూ.1,01,564 కోట్లు కేటాయించారు. సమర్థమైన చేకూర్పు విధానాలు అన్ని రంగాలలో అమలు చేయడం ద్వారా అభివృద్ధి సాధించగలుతామని సీఎం అన్నారు. ప్రాధాన్య అంశాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. ఇందుకోసం బ్యాంకుల పరిధిలో, ప్రాంతాల పరిధిలో, గ్రామాల పరిధిలో లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు.