బ్యాంకులు సామాన్యులకు చేరువ కావాలి

మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా సాగాలి
న్యూఢల్లీి,మే24 (జనంసాక్షి):మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. దీనికితోడు ప్రజలు కడుపు కాల్చుకుని పొదుపు చేస్తుంటారు. రేపటి అసవరాలకు గాను పొదుపును అలవాటుగా మార్చుకున్నారు. ఇలా కూడబెట్టినదంతా సంపాదనకింద చూపాలంటే ఎలా సాధ్యమన్నది పాలకులు ఆలోచన చేయడం లేదు. బ్యాంకుల్లో వేసిన ప్రతిపైసాకు లెక్క చెప్పడం సాధ్యం కాదు. అతిగా డబ్బులు పోగయితే దానిగురించి అడగవచ్చు. ఆదాయం చూపమనికోరవచ్చు. కానీ 50 వేలకే లెక్కలు అడగడం వల్ల ప్రజలు బ్యాంకుల వైపు పోవడం లేదు. దాచుకోవాల్సిన డబ్బు విషయంలో ఓ విధానం అంటూ ఉండాలి. అది అక్రమమా సక్రమమా అన్నది గుర్తించకుండా డబ్బు కనిపిస్తే దానిపై పన్ను వేయడం, ఐటి దాడులు చేయడం వల్ల డబ్బులు దాచుకునేం దుకు విదేశాలపై ఆధారపడుతున్నారు. నిజానికి దేశంలో నల్లధనం, అవినీతి పోవాలంటే రాజకీయ పార్టీల నుంచే ప్రక్షాళన మొదలవ్వాలి. నల్లధనం రూపంలో రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకుని ఓటర్లను కొనుగోలు చేయడానికి వాడుతున్నాయి. ఎన్నికలు అయ్యాక తగిన మెజారిటీ సమకూరని సందర్భాలలో ఎమ్మెల్యేలు లేదా ఎంపీల బేరసారాల కోసం ఈ నల్లధనాన్నే వాడుతున్నారు. వ్యాపారులు, పారిశ్రామిక
వేత్తలు రాజకీయ పార్టీలకు ఇస్తున్న విరాళాలలో అత్యధిక భాగం నల్లడబ్బు రూపంలోనే ఉంటోంది. ఈ పరిస్థితిని నివారించకుండా ఎన్ని సంస్కరణలు చేసినా ఫలితం ఉండదు. ప్రజలకు అందని నగదు రాజకీయ పార్టీలకు మాత్రం లభిస్తోంది. ఎన్నికల్లో ఆయా పార్టీలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వైనం చూస్తున్నాం. అన్నిరంగాల్లో మనం ముందంజ వేయాల్సిన దశలో ఇంకా దిగుబడులపై ఆధారపడుతూ ఎగుమతుల విషయంలో లక్ష్యం లేకుండా సాగుతున్నాం. మనం చేపట్టిన సంస్కరణలు ఫలితాలు ఇవ్వడం లేదన్న విషయాన్ని గుర్తించడం లేదు. ఎన్నికలలో డబ్బు అవసరం లేకుండా సంస్కరణలు తీసుకుని రాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేదు. రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం అధికారమే కనుక, ఆ అధికారం కోసం ఎంతకైనా తెగబడ తాయని ఈ 75 ఏళ్లలో నిరూపితం అయ్యింది. ఆ క్రమంలోనే ఖర్చు వందలు, వేల కోట్ల రూపాయలకు చేరిపోయింది. దేశంలో ఇప్పటికీ సరైన ప్రాజరోగ్య వ్యవస్థ లేదు. వ్యవసాయరంగం కుంగి కృషించిపోతోంది. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆహార ధాన్యాలకు మద్దతు ధరలు అందడం లేదు. విద్య మిధ్యగా మారింది. ఉద్యోగాల కల్పన అంతంత మాత్రంగానే ఉంది. ఈ అసమానతల తొలగింపునకు రాజకీయ సంకల్పం బలంగా ఉండాలి. ప్రధానంగగా బ్యాంకులను ప్రజలకు చేరువ చేయాలి. డబ్బులను ధైర్యంగా బ్యాంకుల్లో వేయగలగాలి. ఇబ్బడిముబ్బడిగా బ్యాంకులు వేస్తున్న వడ్డింపులు దారుణంగగా ఉన్నాయి. టిడిఎస్‌ విధానంలోనూ మార్పులు రావాలి. ఆర్థక రంగంపై సంస్కరణలపై ఆలోచన చేయాలి.