బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్
విశాఖ:ఐపీఎల్ -8 లో భాగంగా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కు దిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్.. హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించడంతో ఓపెనర్లు శిఖర్ ధావన్,డేవిడ్ వార్నర్ లు బ్యాటింగ్ ఆరంభించారు. ఇప్పటికే రాజస్థాన్ వరుస మూడు విజయాలను కైవశం చేసుకుని దూసుకుపోతుండగా, సన్ రైజర్స్ ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ లో ఓటమి చవిచూసింది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉండటంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.