బ్యాట్స్ మెన్ పరువు తీయవద్దు

'కోహ్లీ.. ప్లీజ్ బ్యాట్స్ మెన్ పరువు తీయవద్దు'
 న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ దూసుకుపోతున్నాడు. ఏ విధ్వంసక బ్యాట్స్ మన్ కు సాధ్యం కాని రికార్డులు తిరగరాస్తున్నాడు కోహ్లీ. ఒకే సీజన్లో 4 సెంచరీలు బాది అతడు బౌలర్లతో పాటు బ్యాట్స్ మన్లకు ఓ పెద్ద సవాలుగా మారాడు. ఈ సీజన్లో ఇప్పటికే 865 పరుగులు చేసి టాప్ లో ఉన్నాడు కోహ్లీ. రెండో స్థానంలో ఉన్న సహచర ఆటగాడు ఏబీ డివిలియర్స్ రన్స్, కోహ్లీ పరుగుల వ్యత్యాసం 268 ఉండటం అతడు చెలరేగిన తీరును స్పష్టం చేస్తోంది. బౌలర్లకు లేని నొప్పి బ్యాట్స్ మన్లకు ఎందుకంటారా?.. ఈ వివరాలు చూస్తే అర్థమైపోతోంది.

గుజరాత్ లయన్స్ హార్డ్ హిట్టర్ ఆరోన్ ఫించ్, బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి చేసిన ట్వీట్ చూస్తే ఆశ్చర్యపోతారు. బ్యాటింగ్ చేయడం మరీ ఇంత సులువు అనేలా ఇన్నింగ్స్ లు ఆడుతున్నావు. దయచేసి ఇలాంటి విధ్వసంక ఆటతీరు ప్రదర్శించి ఇతర బ్యాట్స్ మన్ పరువు కోరుతున్నట్లు ఓ లేఖ తరహాలో ట్వీట్ చేశాడు. పరుగులు చేయడం ఇంత ఈజీ అన్న తీరుగా శతక్కొడుతున్న కోహ్లీకి విజ్ఞప్తి చేశాడు. డియర్ కోహ్లీ అని మొదలుపెట్టిన ఫించ్.. నీ బ్యాటింగ్ వల్ల ప్రపంచంలోని ఇతర బ్యాట్స్ మన్ కు వణుకు పుడుతోందని, వారు చాలా ఆందోళన చెందుతున్నారని పోస్ట్ చేశాడు. ఫించ్ జట్టు గుజరాత్ పై బెంగళూరు జట్టు ఐపీఎల్ అన్ని సీజన్లలోనే 144 పరుగుల తేడాతో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.