బ్రహ్మాచారి అలంకరణలో అమ్మవారు

బాసరలో పెరిగిన భక్తుల రద్దీ
బాసర,అక్టోబర్‌11(జ‌నంసాక్షి):  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి ముగ్గురమ్మలు కొలువుతీరిన మహాక్షేత్రంలో రెండో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం జ్ఞాన సరస్వతి అమ్మవారు బ్రహ్మచారి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా గోదావరిలో పుణ్యస్నాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. తమ చిన్నారులకు అక్షరాభాస్యం నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. నాందేడ్‌కు చెందిన జగదీశ్‌ మహరాజ్‌ భక్తులు ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నారు. గోదావరిలో స్నాలకు రద్దీ పెరిగింది. భక్తులు తెల్లవారు జామునే స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్షరాభ్యాసాలు కొనసాగాయి.