బ్రెజిల్‌-జర్మనీ మ్యాచ్‌కు వీఐపీ అతిథి

రియో డి జనీరో: బ్రెజిల్‌- జర్మనీ మధ్య జరిగిన పురుషుల ఫుట్‌బాల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఓ వీఐపీ అతిథి వచ్చాడు. స్పోర్ట్స్‌ జాకెట్‌, కళ్లజోడు, మెడలో పాస్‌, నెత్తిన టోపీ పెట్టుకొచ్చిన ఆ వ్యక్తిని తొలుత ఎవరూ గుర్తించలేదు.. కానీ ఆ మెరుపు వీరుడిని గుర్తించిన వెంటనే కెమేరా ఫ్లాష్‌లు తళుక్కుమన్నాయి. ఆయనే అథ్లెటిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ చరిత్రతో అత్యుత్తమ క్రీడాకారుడు ఉసేన్‌ బోల్ట్‌..! ఒలింపిక్‌ కెరీర్‌ ముగించిన బోల్ట్‌ చాలా కూల్‌గా కనిపించాడు.