బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఎంఐఎం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 14 : తమ స్వప్రయోజనాల కోసం ఎంఐఎం పార్టీ ప్రభుత్వాన్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంనాథ్‌ ఆరోపించారు. ఎంఐఎం పార్టీ నేతలు తమ పనులను పూర్తి చేసుకోవడానికే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంత కాలం ఎంఐఎం పార్టీకి కొమ్ముకాయడం వల్ల పాతబస్తీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని ఆయన పేర్కొన్నారు. చార్మినర్‌ పరిసర ప్రాంతాల్లో భాగ్యలక్ష్మి ఆలయ అభివృద్ధికి అడ్డుపడితే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఆలయ రక్షణకు చర్యలు తీసుకొని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు.