భద్రతా ప్రమాణాల లోపంతోనే రోడ్డు ప్రమాదాలు
రాజీవ్ రహదారి విస్తరణ పనులను పరిశీలించిన సభాసంఘం
కరీంనగర్: రాజీవ్ రహదారి విస్తరణ పనుల పరిశీలన కొనసాగుతోంది. రెండో రోజు సభాసంఘం కరీంనగర్ జిల్లా ముగ్దుం వద్ద రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించింది. పరిశీలనలో నాణ్యతా లోపాలు, మలుపుల సమస్యలు దృష్టికొచ్చాయపి సభాసంఘం చైర్మన్ భానుప్రసాద్ తెలియజేశారు. గుత్తేదారులు భద్రతా ప్రయాణాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. రోడ్డు నిర్మాణ పనులపై పలువురు స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులపై భానుప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.