భద్రాద్రి పవర్‌ప్లాంట్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

yxxrdcnzఖమ్మం : ఖమ్మం జిల్లా మణుగూరు మండలంలో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. చిక్కుడుగుంటలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ పవర్ ప్లాంట్ మూడేళ్లలో అందుబాటులోకి వస్తుంది.