భర్తను హత్య చేసిన భార్య
కరీంనగర్,ఆగస్టు 24: పట్టణ శివారు ప్రాంతంలో భర్తను హత్య చేసిన భార్య. మృతుడు ఎండీ సాబీర్(45) గత కొంత కాలంగా రోజు మద్యం తాగివచ్చి గొడవ చేస్తుంటే అది తట్టుకోలేకనే షహనాజ్ చున్నితో అతని మెడకు బిగించి హత్యచేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ ఘటనను ఆత్మహత్యగా ఆమె తెలిపినా తరువాత పోలీసు విచారణలో నెనే హత్య చేశానని షహనాజ్ ఒప్పుకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.