భవనంపై కూలిన రష్యా క్షిపణి

, హైదరాబాద్‌: రష్యాకి చెందిన తక్కువ ఎత్తులో ప్రయాణం చేసే క్షిపణి (క్రూయిజ్‌ మిసైల్‌) ఒక భవనంపై కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రష్యా రక్షణశాఖ అధికారులు తెలిపారు. సైనిక శిక్షణలో భాగంగా దానిని ప్రయోగించగా.. ప్రయోగం విఫలమైందని వారు చెప్పారు. మిసైల్‌ దారితప్పి న్యోనోస్కా పట్టణానికి సమీపంలో ఓ భవనంపై పడిపోయింది. వెంటనే అక్కడ పెద్ద ఎత్తున మంటలు లేచాయి. ఈ ఘటన కారణంగా రెండంతస్థుల భవనం పూర్తిగా ధ్వంసమైనట్లు వారు చెప్పారు. దీనిపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఈ పట్టణం రష్యా రాజధాని మాస్కోకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.