భవిష్యత్తులో ఆధార్‌ కార్డులే కీలకం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 24 : భవిష్యత్తులో ఆధార కార్డులే అత్యంత కీలకంగా మారుతాయని జాతీయ ప్రణాళిక సంఘం సహాయ సంచాలకులు పిఎస్‌ఎన్‌ మూర్తి పేర్కొన్నారు. జిల్లాలోని జైయ్‌పూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఆధార్‌ కేంద్రాలను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు కోసం ఈ ప్రక్రియను చేపట్టిందని అన్నారు. జిల్లాలో 27.37 లక్షల జనాబా ఉండగా, ఇప్పటి వరకు 18లక్షల ఆధార్‌కార్డులు జారీ చేశామన్నారు. మిగత వాటిని వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డును తీసుకోవాలని ఈ కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురౖెెనా వెంటనే సంబంధిత అధికారులను ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఆధార్‌ కేంద్రాలను వారంలో రోజుల్లోగా ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు.