భవిష్యత్తు లో వనపర్తి గొప్ప పట్టణంగా రాజిల్లుతుంది.

నూతన పరిశ్రమల ఏర్పాటుతో వేల మందికి ఉపాది

భవిష్యత్తు లో వనపర్తి కి తాగు నీటి కొరత ఉండదు.

శాశ్వతంగా నిలిచి పోయే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్28 (జనంసాక్షి)

దక్షిణ తెలంగాణలో నే వనపర్తి గొప్ప  పట్టణంగా భాసిల్లతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి పట్టణంలో ని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లా లో నూతన పరిశ్రమల ఏర్పాటు తో వేలాది మంది కి ఉపాది అవకాశాలు లభిస్తాయన్నా రు.భవిష్యత్తు లో వనపర్తి కి తాగు నీటి కొరత ఉందన్నారు .తెలంగాణ నేల మీద పారే ప్రతి నీటిబొట్టును వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో ఎంతో దూరదృష్టితో నీటిపారుదల పనులు కొనసాగిస్తున్నామన్నారు. అభివృద్ది పనుల ప్రారంభంలో చరిత్ర  సృష్టిస్తున్నా ఆయన చెప్పారు. రూ.425 కోట్ల మిషన్ భగీరథ పనులు పూర్తి చేశామన్నారు. ఒక్క పట్టణంలోనే 1500 పై చిలుకు డబల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి నిరుపేదలకు, రోడ్డు విస్తరణ బాధితులకు ఇవ్వడం జరిగిదని మంత్రి వెల్లడించారు.  వనపర్తి ప్రజలు, సాహితీవేత్తలు, ఇతరుల కార్యక్రమాల కోసం రూ.5.75 కోట్లతో సురవరం సాహితీ కళాభవనం (టౌన్ హాల్) నిర్మించడం జరిగిందని ఆయన చెప్పారు. ప్రతిష్టాత్మకంగా ఐటీ టవర్ ను నిర్మిస్తామన్నారు. రూ.20 కోట్లతో సమీకృత శాఖాహార, మాంసాహార, పండ్లు, పూల మార్కెట్ ను నిర్మించడం జరిగిందన్నారు. సమీకృత మార్కెట్ లోనే  సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. సురవరం ప్రతాపరెడ్డి పేరుతో నిర్మించిన గ్రంథాలయం ప్రారంభించుకోనున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, యువత, విద్యార్థులకు అందుబాటులో ప్రింట్ , డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేశామన్నారు.
విలువైన గ్రంథాలతో సురవరం గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుతామని, రాష్ట్రానికి ఆదర్శంగా నిలుపుతా మన్నారు. రూ.76 కోట్ల తో బైపాస్ రహదారి నిర్మాణానికి, రూ.48 కోట్ల తో పెబ్బేరు రహదారి నిర్మాణానికి ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్  శంకుస్థాపన చేస్తారని ఆయన చెప్పారు. రూ.22 కోట్లతో వనపర్తి రాజప్రాసాదం పునరుద్దరణ, శిథిలమైతున్న పాలిటెక్నిక్ హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు.వనపర్తి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతున్నదన్నారు.అంతే కాకుండా  జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల అందరికీ ఉపయోగకరంగా ఉంటాయన్నారు. భవిష్యత్ లో చిట్యాల, రాజనగరం మీదుగా మరో బైపాస్ రహదారి నిర్మిస్తామన్నారు.
మొదటి దశలో సంకిరెడ్డిపల్లిలో రూ.300 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామన్నారు.నూతన పరిశ్రమల ఏర్పాటుతో కొత్తగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఏదుల రిజర్వాయర్ కడుతుంటే ఎగతాళి చేశారని, అను కున్న  సమయం కన్నా ముందే   పూర్తిచేశామని ఆయన స్పష్టం చేశారు. వనపర్తికి ఏదుల సాగునీటికి, తాగునీటికి వరప్రదాయిణిగా నిలవనున్నదన్నారు.

నేడు వనపర్తి కి మంత్రుల రాకా

మంత్రి కేటీఅర్ , ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ లు శుక్రవారం  వనపర్తి పర్యటన  నేపథ్యంలో రానున్నారని ఆయన చెప్పారు. అదే విధంగా వనపర్తి ప్రగతి పై రూపొందించిన ‘వనపర్తి ప్రగతి ప్రస్థానం’ కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి  విడుదల చేశారు.బుక్కు లను బీఆర్ ఎస్ నేతలకు, జర్నలిస్టు లకు మంత్రి స్వయంగా పంపిణీ చేశారు.

*హరిత విప్లవ  పితామహుడు ఎంఎస్ స్వామి నాథన్ మృతి పట్ల సంతాపం

హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామి నాథన్ మృతి పట్ల మంత్రి నిరంజన్ రెడ్డి సంతాపం, సానుభూతి తెలిపారు.  మేలురకమైన వంగడాలను సృష్టించి ప్రపంచ ఆకలిని తీర్చిన మహనీయులు స్వామి నాథన్ అని ఆయన కొనియాడారు. భారత్ స్వయం సమృద్ది సాధించేందుకు ఆయన కృషి మరవలేని దన్నారు.వ్యవసాయ రంగంలో కొత్త వరవడిని సృష్టించి హరిత విప్లవ కారుడన్నారు.ఆయన మరణం పట్ల సంతాపం తెలిపారు.ఈ సమావేశంలో  వనపర్తి మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడు ,మున్సిపల్ ఛైర్మన్ గట్టు యాదవ్, వైఎస్ ఛైర్మన్ వాకిటి శ్రీధర్, చంద్రశేఖర్ నాయక్, కురుమూర్తి యాదవ్, నందిమల్ల శ్యాం,సందీప్ రెడ్డి ,గణేష్, పరం జ్యోతి తదితరులు ఉన్నారు.