భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్.ట్రస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు 2023 పురస్కారాలు.
భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం పద్మనాయక కళ్యాణ మండపంలో ట్రస్మా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2023 కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని తెలిపారు. గతంలో ఎంపీగా ఉన్న కాలంలో ప్రైవేటు ఉపాధ్యాయుల కోసం తాను ఎంతో కృషి చేశానని గుర్తు చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు 2023 పురస్కారాన్ని అందజేస్తూ ఆత్మీయంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్మ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, పవర్లూం టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, హైదరాబాద్ ట్రస్మా బాధ్యులు రేఖ, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, చెలిమెడ లక్ష్మీనరసింహారావు, ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి నరాల దేవేందర్, గుగ్గిళ్ళ జగన్ గౌడ్ ,శ్రీ గాధ గణేష్, మండల చిరంజీవి, యేల్లే శ్రీనివాస్, చిలక కిరణ్ కుమార్, పల్లె రాజిరెడ్డి, జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.