భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభం
ఢిల్లీ: ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందకు భాజపా అగ్ర నేతలు భేటీ అయ్యారు. పార్టీ నేత ఎల్‌కే అద్వానీ నివాసంలో పార్టీ అధ్యక్షుడు గడ్కరీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, షనవాజ్ హుస్సేస్ తదితరులు సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ప్రవేశపెడ్తానన్న అవిశ్వాస తీర్మానంపై నేతలు చర్చించనున్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే విషయంపై నేతలు ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.