భారతీయుల చరిత్రాత్మక విజయం

అమెరికా సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు సంచలనం సృష్టించారు. వివిధ రాషా్ట్రల్లోని స్థానాల నుంచి నలుగురు అమెరికా ప్రతినిధుల సభకు.. మరొకరు అమెరికా సెనేట్‌కు ఎన్నికై చరిత్రాత్మక విజయం సాధించారు. అగ్రరాజ్యంలో అనూహ్యంగా భారతీయుల గాలిkamiharris వీచింది. కాలిఫోర్నియా నుంచి సెనేటర్‌గా ఎన్నికైన కమలా హారిస్‌.. ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి, ఆసియన్‌, భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. అదేవిధంగా డాక్టర్‌ అమీ బెరా, ఆర్‌వో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్‌ ప్రతినిధుల సభకు ఎన్నికై విజయ బావుటా ఎగురవేశారు. వీరిలో కమలా హారిస్‌, కృష్ణమూర్తి, అమీ బెరా అభ్యర్థిత్వానికి ప్రస్తుత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మద్దతు తెలిపారు. ‘‘కమలా హారి్‌సను సెనేట్‌కు పంపితే.. కాలిఫోర్నియా ప్రజల తరఫున ఆమె నిరంతరం నిర్భయంగా పోరాడతారు’’ అని ఒబామా కితాబునిచ్చారు. ప్రమీలా జయపాల్‌ను సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌, అమెరికా మాజీ  అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ బలపరిచారు.