భారత్‌లో సిటీ బ్యాంక్ కన్జూమర్ బిజినెస్ టేకోవర్
యాక్సిస్ బ్యాంక్ ప్రతిపాదనకు సీసీఐ ఆమోదం
న్యూఢల్లీి,జూలై27(జనంసాక్షి ): భారత్‌లో సిటీ బ్యాంక్ కన్జూమర్ బిజినెస్‌ను టేకోవర్ చేసుకోవాలన్న యాక్సిస్ బ్యాంక్ ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ఆమోదం తెలిపింది. సిటీ బ్యాంక్`యాక్సిస్ బ్యాంక్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం దేశీయంగా ఫైనాన్సియల్ సర్వీసెస్ రంగంలోనే అతిపెద్దది. గత మార్చి 30న భారత్‌లో సిటీ బ్యాంక్ బిజినెస్‌ను టేకోవర్ చేసుకునేందుకు యాక్సిస్ బ్యాంక్
దాఖలు చేసిన బిడ్‌కు ఆమోదం లభించింది. రూ.12,325 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌లో సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్, వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్.. యాక్సిస్ బ్యాంకులో విలీనం అవుతాయి. సిటీ బ్యాంక్ భారత్ బిజినెస్‌ను టేకోవర్ చేయాలన్న యాక్సిస్ బ్యాంక్ ప్రతిపాదనను ఆమోదించినట్లు సీసీఐ ట్విట్టర్ వేదికగా వెల్లడిరచింది. దేశీయ పారిశ్రామిక రంగంలో రెండు సంస్థల మధ్య విలీన, టేకోవర్ ఒప్పందాలకు సీసీఐ ఆమోదం తప్పనిసరి. సిటీ బ్యాంక్‌తో యాక్సిస్ బ్యాంక్ చేసుకున్న ఒప్పందం ప్రకారం 2024 సెప్టెంబర్ నాటికి యాక్సిస్ బ్యాంకుకు 30 లక్షల మంది నూతన కస్టమర్లు జత కలుస్తారు. కన్జూమర్ బిజినెస్ లాభదాయకంగా లేనందున భారత్ సహా పలు దేశాల మార్కెట్ల నుంచి నిష్కమ్రిస్తున్నట్లు గతేడాది సిటీ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.