భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీజీ ని కలిసిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్
కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడోయాత్రలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో కలిసి రాహుల్ గాంధీని కలిసిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్. ఈ సందర్భంగా నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రజలు, రైతులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు వివిధ సంఘాల కుల నాయకులు స్వచ్ఛందంగా భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారని తెలిపారు రాహుల్ గాంధీ పాదయాత్ర దేశ నలుమూలల నుండి ప్రశంసలు అందుతున్నాయని తెలిపారు స్వార్థం, కల్మషం లేని స్వచ్ఛమైన నాయకుడు మన ప్రియతమ ఆరాధ్య నాయకుడు రాహుల్ గాంధీ అని తెలిపారు నేడు హైదరాబాద్ లో ప్రవేశించిన భారత్ జోడోయాత్ర అధిక ధరలు, నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న ప్రజలను ఏకతాటిపై తేవడానికి రాహుల్ గాంధీజీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర విజయవంతం కావాలని ఆయన కోరారు