భారత్, పాక్ అణ్వాయుధాలు తగ్గించాలి : ఒబామా

88వాషింగ్టన్ : భారత్, పాకిస్థాన్ దేశాలు అణ్వాయుధాల సమీకరణను తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. రెండు దేశాలూ సైనిక సత్తాపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. అమెరికా, రష్యా లాంటి అగ్రదేశాలు అణ్వాయుధాలను తగ్గించనంత వరకు ఇతర దేశాలు కూడా ఆ పంథాలో వెళ్లలేవన్న అనుమానాన్ని ఒబామా వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆ దేశం వల్ల పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. అంతర్జాతీయ దేశాలు దీనిపై ఫోకస్ చేయాలన్నారు.

చైనా సమీప దేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌తో అణ్వాయుధాలతో ప్రత్యేక చర్చలు నిర్వహించినట్లు ఒబామా తెలిపారు. పాకిస్థాన్ వేగవంతంగా తన అణ్వాయుధ సత్తాను పెంచుకుంటున్న నేపథ్యంలో ఈ అంశంపై దృష్టి పెట్టాలని ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.