భారత్ పై మళ్ళి నోరు జారిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరి కొన్ని గంటలలో జరగనుండగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రంగంలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం సృష్టించారు. ఐబీఎం సంస్థలో అమెరికన్లను తొలగించి భారత్ సహా ఇతర దేశాల ఉద్యోగులను చేర్చుకుంటోం1-trumpదని ధ్వజమెత్తారు. ఇటువంటి చర్యలకు పాల్పడే సంస్థలకు తాను అధికారంలోనికి వస్తే 35శాతం పన్ను విధిస్తానని పేర్కొన్నారు. నిన్నటి వరకూ ట్రంప్ కుటుంబ సభ్యులు భారతీయుల ఓట్ల కోసం హిందూ దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. చివరి నిముషంలో ట్రంప్ భారతీయులకు అమెరికా కంపెనీల్లో ఉద్యోగాలపై ధ్వజమెత్తడం గమనార్హం.