భారీగా తిరుమలకు భక్తులు
బ్ర¬్మత్సవాలతో పులకించిన తిరుమల
భక్తుల సౌకర్యాలను పరిశీలించిన టిటిడి ఛైర్మన్, ఈవో
తిరుమల,సెప్టెంబర్17(జనంసాక్షి): శ్రీవారి వార్షిక బ్ర¬్మత్సవాల్లో భాగంగా గరుడసేవ రోజైన సోమవారం మధ్యాహ్నం ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో కె.ఎస్. శ్రీనివాసరాజు వివిధ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. సోమవారం భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. శని,ఆదివారాల్లోనే భక్తుల రాక మొదలయ్యింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నామని, ఈసారి భక్తులకు అసౌకర్యం కలగకుండా చాలినన్ని మరుగుదొడ్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో రాత్రి 1 గంట వరకు అన్నప్రసాదాలు అందజేస్తామని వెల్లడించారు. మాడ వీధుల్లో భక్తులు వీక్షించేందుకు వీలుగా 19 డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటుచేశామన్నారు. వాతావరణం చల్లబడడంతో భక్తులు ప్రశాంతంగా గరుడసేవను తిలకించవచ్చన్నారు. అంతకుముందు టిటిడి ఛైర్మన్, ఈవోలు మాడ వీధుల్లోని ప్రతి గ్యాలరీని, అన్నప్రసాద భవనాన్ని తనిఖీ చేశారు. శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలను పరిశీలించారు. ఈ
సందర్భంగా భక్తులకు ఉప్మా, టమోటా రైస్, సాంబారన్నం, పెరుగన్నం, పులి¬ర, పాలు, కాఫి, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. భక్తులకు అవసరమైన పక్షంలో వైద్యసేవలు అందించేందుకు వీలుగా వైద్యుల బృందం మందులను సిద్ధంగా ఉంచుకున్నారు. భక్తులు గ్యాలరీల నుండి తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భద్రత, ఇంజినీరింగ్ అధికారులకు ఛైర్మన్, ఈవో సూచించారు.ఈ తనిఖీల్లో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ఎఫ్‌ఏ సిఏవో బాలాజి, ఎస్‌ఇలు రామచంద్రారెడ్డి, రమేష్‌రెడ్డి, విఎస్‌వో రవీంద్రారెడ్డి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.