భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

అంతర్జాతీయ ప్రభావంతో కుప్పకూలిన షేర్లు
ముంబై,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రబావంతో మార్కెట్లు కుప్పకూలాయి. వివి దదేశాల్లో కరోనా కేసులు కూడా దోహపడ్డాయి. దీంతో సెన్సెక్స్‌ 540 పాయింట్లు 1.33శాతం పాయింట్లు నష్టపోయి 40,145.50 వద్ద, నిప్టీ 162.60 పాయింట్లు 1.36శాతం దిగజారి 11,767.80 వద్ద ముగిసింది. మార్కెట్లు కుప్పకూలడంతో ఒక్కరోజే రూ.1.92 లక్షల ఇన్వెస్టర్ల సంపద తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం, అమెరికా సహా పలు మార్కెట్లు నష్టపోవడంతో ఈ ప్రభావం మన మార్కెట్‌ పైన పడింది. వీటికి అదనంగా భారత దిగ్గజ కంపెనీ, బీఎస్‌ఈలో 17 శాతం వాటా కలిగిన రిలయన్స్‌ 3.70 శాతం మేర నష్టపోవడం భారీగా దెబ్బతీసింది. ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్టీస్ర్‌ , జెఫ్‌ బెజోస్‌కు చెందిన అమెజాన్‌ మధ్య ఫ్యూచర్‌ గ్రూప్‌ కొనుగోలుపై టగ్‌ ఆఫ్‌ వార్‌ నడుస్తోంది. ముఖేష్‌ వర్సెస్‌ జెఫ్‌ బెజోస్‌గా ఉంది. ఫ్యూచర్‌ గ్రూప్‌ను రిలయన్స్‌ రూ.24వేల కోట్లకు పైగా పెట్టుబడులతో కొనుగోలు చేసింది. దీనిపై అమెజాన్‌ సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టుకు వెళ్లింది. అమెజాన్‌కు ఊరటనిచ్చేలా మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. దీంతో రిలయన్స్‌ షేర్‌ భారీగా పడిపోయింది. ఓ విధంగా సెన్సెక్స్‌ భారీగా నష్టపోవడానికి ఇది కూడా కీలక కారణం. బీఎస్‌ఈలో 17 శాతానికి పైగా వాటా కలిగిన రిలయన్స్‌ దాదాపు 4 శాతం దిగజారడం ఎక్కువ ప్రభావం చూపింది. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఈ రోజు ఒక్కరోజే రూ.1.92 లక్షల కోట్లు క్షీణించి రూ.158.66 లక్షల కోట్లకు పడిపోయాయి. రిలయన్స్‌ దాదాపు 4 శాతం క్షీణించగా, ఆటో, మెటల్‌ స్టాక్స్‌ కూడా కుప్పకూలాయి. గతవారం లాభాల్లో ముగిసిన మార్కెట్లు, అంతకుముందు వారం ఒక్కరోజే 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. వరుసగా పది రోజుల ర్యాలీని ఆ గురువారం దెబ్బతీసింది. ఆ తర్వాత నాలుగు రోజుల వరుస ర్యాలీకి గత గురువారం బ్రేక్‌ ఇచ్చింది. ఇండియా వీఐఎస్‌ (ఇండికేటర్‌ ఆఫ్‌ వోలాటిలిటీ) దాదాపు 15 శాతం పెరిగింది. దిగ్గజ కంపెనీల్లో హెచ్డీ ఎఫ్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ 3 శాతానికి పైగా ఎగిసి రూ.582.35 వద్ద క్లోజ్‌ అయింది. నెస్‌ట్లే ఇండియా, కొటక్‌ మహీంద్ర బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌, ఎస్బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, పవర్‌ గ్రిడ్‌ కంపెనీలు ఒక శాతం నుంచి మూడు శాతం మేర పెరిగాయి. హీరో మోటో కార్ప్‌, బజాజ్‌ ఆటో ఒక్కొక్కటి ఆరు శాతానికి పైగా, హిండాల్కో 5.34 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 4.69 శాతం, జేఎస్‌డబ్ల్యు స్టీల్‌ 4.39 శాతం కోల్పోయింది. స్మాల్‌ క్యాప్‌ 1 శాతానికి పైగా పడిపోయింది. మిడ్‌ క్యాప్‌ 1.71 శాతం నష్టపోయింది.