భార్యలను వదిలేసి పారిపోయిన 

ఎన్‌ఆర్‌ఐ భర్తల పాస్‌పోర్టులు రద్దు
న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : భార్యలను వదిలేసి పారిపోయిన ఎనిమిది మంది ఎన్‌ఆర్‌ఐ భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎనిమిది మంది ఎన్‌ఆర్‌ఐల పాస్‌పోర్టులు రద్దు చేయడమే కాకుండా వారిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ మోసగాళ్లపై దర్యాప్తు చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ, విదేశాంగ శాఖ, ¬ం శాఖ కలిసి సంయుక్తంగా అంతర్గత మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ కమిటీకి గత రెండు నెలల్లో 70 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం భార్యలను వదిలేసి పారిపోయిన ఎనిమిది మంది ఎన్‌ఆర్‌ఐ భర్తల పాస్‌పోర్టులు రద్దు చేసినట్లు చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఇలాంటి వివాహాలను నమోదు చేసేందుకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ కూడా ఏర్పాటు చేసింది. అయితే దాన్ని ఇంకా ప్రారంభించలేదు. ఎన్‌ఆర్‌ఐ వివాహాలను వెంటనే రిజిస్టర్‌ చేసే విధంగా అన్ని రాష్ట్రాలు రిజిస్టార్లక్రు మార్గదర్శకాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీ కోరారు. ఎన్‌ఆర్‌ఐ వివాహాలను ఏడు రోజుల్లోనే నమోదు చేయాలని మేనకాగాంధీ గతంలో కూడా వెల్లడించారు. లేదంటే వారికి పాస్‌పోర్టులు, వీసాలు ఇవ్వబోమని తెలిపారు. మోసగాళ్లు, భాగస్వాములను వదిలేసి పారిపోయిన ఎన్‌ఆర్‌ఐల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలనే మరో ప్రతిపాదన కూడా ఉంది.