భావి తరాల భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తున్నాం

పల్లెల అభివృద్దితోనే దేశాభివృద్ది

సాగునీరు, తాగునీరు రాకతో పల్లెల్లో సమగ్రాభివృద్ధి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్25 (జనంసాక్షి)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని పల్లెలు అభివృద్ధి చెందుతేనే దేశాభివృద్ధి చెందినట్లని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.ఆదివారం ఖిల్లాఘణపురం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ది, శంకుస్థాపన పనులకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచింది.వలసలు పోయిన నేలకు ఉపాధి కోసం వలసలు వస్తున్నారు.పటిష్టమైన ప్రణాళికతో గ్రామాలను అభివృద్ది చేస్తున్నాం.గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తు
పదేళ్లలో దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలబెట్టాం.అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు