భూగర్భ గనుల్లో అగ్రగామి ఆర్కే-7

శ్రీరాంపూర్‌(ఆదిలాబాద్‌), న్యూస్‌లైన్‌: శ్రీరాంపూర్‌ ఏరియా పరిధిలో ఆర్కే-7 భూగర్భ గని 2012-13 ఆర్థిక సంవత్సరం ఉత్పత్తిలో సింగరేణిలోనే అగ్రస్థానంలో నిలిచింది. గనికి నిర్దేశించిన వార్షిక లక్ష్యం 4.50 లక్షల టన్నులకు గాను మార్చి 31వ తేదీ నాటికి 4.81 లక్షల టన్నులు(107 శాతం) సాధించిది. అంతే కాకుండా 21 రోజుల ముందుగానే లక్ష్యాన్ని చేరుకుంది. గనిలో మొత్తం 1,690 మంది కార్మికులు తొమ్మిది ఎస్‌డీఎల్‌ యంత్రాలు, ఒక హ్యాండ్‌ సెక్షన్‌ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు.

వరుసగా రెండేళ్లు ఎస్‌డీఎల్‌ రికార్డు

ఎస్‌డీఎల్‌ ద్వారా అత్యధిక టబ్బులు నింపిన రికార్డు కూడా ఈ గనికే దక్కింది. ఈ ఏడాది రోజుకు 159 టన్నుల చొప్పున నింపారు. 2011-12లో కూడా 175 టన్నులు నింపి కార్మికులు రికార్డు నెలకొల్పారు. 4,72000 టన్నులకు 4,74,447 టన్నులు (101 శాతం) ఉత్పత్తి సాధించారు. ఈ సారి అధిక ఉత్పత్తితో పాటు ఓఎంఎస్‌ 1.20గా నమోదైంది. ఎస్‌డీఎల్‌ యంత్రాల రోజుకు 10.96 గంటలు సని చేసినట్లు రికార్డులు చెబుతున్నారు. గనిలో పూర్తిగా రూప్‌బోల్డర్‌ ద్వారానే ఇండ్యూస్ట్‌హూల్స్‌ వేస్తున్నారు. రక్షణలో సైతం మెరుగైన ఫలితాలున్నాయి. చిన్న పాటి ప్రమాదాలు తప్ప చెప్పుకోదగ్గ ఘటనలు జరగలోదు. ఉత్పత్తిలో పాటు మిగతా విషయాల్లో గని అగ్రస్థానంలో నిలిచినందుకు కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, యూనియన్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.